హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాంకిడి మండల కేంద్రంలో భారీ వర్షం

ASF: వాంకిడి మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. మూడు రోజుల విరామం తర్వాత వాన పడటంతో ప్రజలకు ఉపశమనం లభించింది. రాత్రివేళ వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వాన కొంత ఊరటనిచ్చింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.