హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెలగని వీధి దీపాలు.. చీకట్లోనే ప్రజలు

NZB: 52వ డివిజన్ పరిధి ఖిల్లా రోడ్డులోని వీధుల్లో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు పని చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత రోడ్లు మొత్తం చీకటిగా మారుతున్నాయి. రాత్రి వేళల్లో ఈ దారిలో వెళ్లాలంటే భయంగా ఉందని స్థానికులు అంటున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పాడైపోయిన లైట్లను రిపేర్ చేయాలని, కోరుతున్నారు.