హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భూములు మత్స్యకారులకే లీజుకివ్వాలి'

SKLM: కాకరాపల్లి తంపర భూములను స్థానిక మత్స్యకారుల సొసైటీకి శాశ్వత ప్రాతిపదికన లీజుకు ఇవ్వాలని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. సత్తబొమ్మాలి మండలం వడ్డితాండ్రలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలతో రైతులు, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోందని ఆరోపించారు.