హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షాలతో ఊపందుకున్న నాట్లు

ASR: డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలు ప్రాంతంలో గురువారం నుంచి శనివారం వరకు కురిసిన మోస్తరు వర్షాలతో వరి నాట్లు ఊపందుకున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వరి సాగు భూములన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ ఏడాది వరి పంట వేయలేమేమోనని రైతులు ఆందోళన చెందారు. తాజాగా కురిసిన వర్షాలతో రైతులు సంతోషిస్తూ శని, ఆదివారాల్లో వరి నాట్లు వేస్తున్నారు.