హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బాధితులకు బ్యాగ్ అందజేసిన పోలీసులు

విశాఖకు చెందిన ఓ యువతి ఆదివారం ఆరిలోవలోని బంధువుల ఇంటికి ఆటోలో వెళ్తూ జగదాంబ జంక్షన్ వద్ద దిగింది. మరో ఆటో ఎక్కే సమయంలో బ్యాగ్ కనిపించకపోవడంతో తల్లితో కలిసి మహారాణిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బ్యాగ్‌లో బంగారం ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. సీసీ కెమెరాల ఆధారంగా మహారాణిపేట పోలీసులు 30 నిమిషాల్లో బ్యాగ్‌ను గుర్తించి యువతికి అప్పగించారు.