హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొలం వివాదంలో ఇరువర్గాల ఘర్షణ

KDP: కమలాపురం మండలం అప్పారావుపల్లెలో పొలం విషయంలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పలువురికి గాయాలు కాగా, ఓ వ్యక్తిని కడప రిమ్స్‌కు తరలించారు. మరో వర్గం వారు కమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలోనూ ఇదే విషయమై గొడవ జరిగినట్లు సమాచారం.