రోజులో మోతాదుకు మించి టీ/కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. వీటిలోని కెఫీన్ మోతాదు మించితే నిద్రలేమి, తీవ్రమైన ఆందోళన, గుండె దడ, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఇది శరీరంలో ఐరన్ శోషణను తగ్గించి రక్తహీనతకు దారితీస్తుంది. నీటి శాతం తగ్గి నిర్జలీకరణం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు 2 కప్పులకు మించకుండా మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఆరోగ్యం
అధికంగా టీ/ కాఫీలు తాగుతున్నారా..?


