హైదరాబాద్: 28°C
వ్యాపారం

దేశంలో 5,625 డార్క్ స్టోర్లు

క్విక్ డెలివరీల కోసం సంస్థలు డార్క్‌ స్టోర్ల(చిన్న గిడ్డంగులు) నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన సంస్థల పరిధిలో 5,625 డార్క్‌ స్టోర్లు అందుబాటులోకి రాగా, బ్లింకిట్‌ 1,955 కేంద్రాలతో అగ్రస్థానంలో నిలిచింది. మెట్రో నగరాల్లో ఖర్చులు అధికంగా ఉండటంతో సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి.