శ్రీలంక-భారత్ తొలి టెస్టులో రెండో రోజు ఆటకు వర్షం అడ్డంకిగా మారింది. ఉదయం 10గంటలకు ప్రారంభం కావాల్సిన ఆట వర్షం కారణంగా ఆలస్యమైంది. పిచ్‌పై కవర్లు తొలగించకపోవడంతో తొలి సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వర్షం తగ్గడంతో మైదానాన్ని సిద్ధం చేసే పనులు కొనసాగుతున్నాయి. మైదానం సిద్ధమైతే రెండో సెషన్‌లో ఆట మధ్యాహ్నం 12.20కు ప్రారంభం కానుంది.
క్రీడలు
వర్షంతో తొలి సెషన్ రద్దు.. మధ్యాహ్నం 12.20కి ఆట?


