హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధికి భారీ నిధులు

NLR: బుచ్చిరెడ్డిపాలెంలో రూ.4 కోట్లతో నూతనంగా నిర్మించిన మూడు అంతస్తుల మున్సిపల్ కార్యాలయ భవనాన్ని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, MLA ప్రశాంతి రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా MP వేమిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ CM చంద్రబాబు స్పష్టమైన ఆర్థిక ప్రణాళికతో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.