హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తిలో పోలీసుల కార్డాన్ సెర్చ్

TPT: శ్రీకాళహస్తిలోని NTR నగర్, కొండమిట్ట ప్రాంతాల్లో DSP నరసింహమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇతర అవసరమైన పత్రాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.