హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

KRNL: శ్రీశైలంలోని సాక్షి గణపతి సమీపంలో బియ్యం లోడ్‌తో వెళ్తున్న ఐచర్ లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ రోడ్డుకు అడ్డంగా పడటంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు JCB సాయంతో లారీని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.