హైదరాబాద్: 28°C
తెలంగాణ

డివైడర్‌ను ఢీ కొన్న బైక్.. వ్యక్తికి తీవ్రగాయాలు

MNCL: శ్రీరాంపూర్ GM కార్యాలయం సమీపంలో రింగ్ రోడ్డు వద్ద ఆదివారం బైక్ అదుపుతప్పి డివైడర్ ఢీకొంది. ఈ ఘటనలో దొరగారిపల్లికి చెందిన జాడి రమేశ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.