JGL: గోదావరి నదీ తీరంలో ఉన్న కోటిలింగాలలో శ్రావణ మాసం వేళ భక్తుల సందడి నెలకొంది. ఉపవాసాలు, పూజలు, వ్రతాలతోపాటు ఆదివారం సెలవు దినం కావడంతో గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా గంగాదేవికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నది తీరంలోని శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
తెలంగాణ
శ్రావణ మాసం వేళ నదీ తీరంలో సందడి


