హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవనూతలలో భారీ అగ్ని ప్రమాదం

BPT: చీరాల (మం) దేవనూతల గ్రామంలో గోనబోయిన పెద్ద అంకయ్య, చిన్న అంకయ్యలకు చెందిన గడ్డివాము మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు నివసించే పూరిల్లు కూడా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం సంభవించగా, ప్రమాదానికి గల కారణాలు తెలియల్సి ఉంది.