హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా సర్దార్ లచ్చన్న జయంతి

కృష్ణా: గుడివాడలో టీడీపీ ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 17వ వార్డులోని లచ్చన్న విగ్రహానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి, బీసీ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం లచ్చన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే అన్నారు. ఆయన ఆశయాలను నేటి తరానికి అందించాలన్నారు.