హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

VZM: అచ్యుతాపురం వెళ్తున్నానని చెప్పి బైక్‌పై బయలుదేరిన మోహన్ అనే యువకుడు, గుర్ల మండలం చుక్కపేట జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. రోడ్డుపై ఉన్న టైర్లను తప్పించబోయే క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు దూరం కావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.