హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

18న ప్రైవేటు బస్సు యజమానుల భేటీ: జేసీ

ATP: ప్రైవేటు బస్సు యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాడాలని మాజీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో ప్రైవేటు బస్సు యజమానుల సమావేశం ఉంటుందని వెల్లడించారు. అందరూ హాజరై సలహాలు అందించాలని కోరారు.