WGL: కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. నల్లబెల్లి మండలం నందిగామకు చెందిన వర్నే యాదగిరి(51) నాలుగు రోజుల క్రితం పొలం నుంచి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో కోతుల గుంపు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడ ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
తెలంగాణ
కోతుల దాడిలో గాయపడిన రైతు మృతి


