BHNG: వంగపల్లి - భువనగిరి రైలు మార్గంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాజీపేట్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లిన రైలు నుంచి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడడంతో తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుందని తెలిపారు. ఆచూకీ కోసం 9848222169 ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి


