MNCL: బెల్లంపల్లి పట్టణంలో ఎక్కడపడితే అక్కడ అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాల బండ్లు వెలిశాయని MCPIU జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి నిబంధనలు పాటించకుండా విక్రయాలు సాగుతున్నాయని ఆరోపించారు. దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'కల్తీ ఆహారాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలి'


