హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వ్యాప్తంగా నాగమ్మకు ప్రత్యేక పూజలు

కోనసీమ: శ్రావణమాసంలో నాగుల చవితితో ప్రధాన పండుగలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఆదివారం నాగుల చవితి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలతోపాటు, ఆయా గ్రామాల్లోని పుట్టల వద్దకు భారీగా భక్తులు చేరుకుని నాగదేవతలకు పాలు పోసి, గుడ్లతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నాగుల చవితినాడు పుట్టలో పాలుపోస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.