NGKL: అచ్చంపేట మండలంలోని పంట పొలాల్లో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే, దానిని మరమ్మతు కేంద్రానికి తరలించేందుకు రైతులు రూ.2,500 నుంచి రూ.3,500 వరకు రవాణా ఖర్చులు భరిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన విద్యుత్ శాఖ ఆ రవాణా ఖర్చులను తిరిగి రైతులకు చెల్లించే అవకాశం కల్పిస్తోందని ఏఈ ఆంజనేయులు తెలిపారు. ఈ సదుపాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: రైతులపై రవాణా ఖర్చుల భారం తగ్గింపు


