హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద

KRNL: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు 21,613 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగింది. ప్రస్తుతం డ్యాంలో 1,629.54 అడుగులకు గాను 92.35 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. దిగువన ఉన్న పలు కాల్వలకు 6,785 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.