హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీఏబీఆర్ కు నీటి విడుదల

ATP: కూడేరు మండల కేంద్రంలోని పెన్నాహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు తుంగభద్ర డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారు. తుంగభద్ర డ్యామ్ నుంచి హెచ్ ఎల్ సి ద్వారా పీఎబీఆర్ డ్యామ్ లోకి 100 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు డి ఈ వెంకటరమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం డ్యామ్ లో 1.852 టీఎంసీల నీరు నిలువ ఉందని తెలిపారు.