హైదరాబాద్: 28°C
తెలంగాణ

సన్నబియ్యానికి నిధులిస్తే మోదీ ఫొటో: మంత్రి

SRPT: స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో ఉండాలన్న బీజేపీ డిమాండ్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కేంద్రం దొడ్డు బియ్యమే అందిస్తోందని, సన్నబియ్యం పంపిణీ ఖర్చును పూర్తిగా భరిస్తే మోదీ ఫొటో అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. పేదల రేషన్ కార్డుల విషయంలో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.