హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం పర్యటన.. ముందస్తు అరెస్టులు

HNK: పరకాలలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మండలాల్లో నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఆత్మకూరు దామెర మండలాలకు చెందిన భాజపా నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులతోపాటు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి భూబాధిత రైతులను ఆదివారం తెల్లవారుజామున నుంచి ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు.