హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్దార్ గౌతు లచ్చన్నకు ఘన నివాళులు

SKLM: సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతిని పురస్కరించుకుని పలాస (M) కిష్టపురం గ్రామంలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆదివారం మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లచ్చన్న సేవలను స్మరించుకున్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.