హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఏసుగూడ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి'

ADB: నేరడిగొండ మండలంలోని ఏసుగూడ గ్రామస్థులు బోథ్ MLA అనిల్ జాదవ్‌ను ఆయన నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో అంతర్గత రోడ్డు, డ్రైనేజీ, ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యేతో విన్నవించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.