హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనారోగ్యంతో మృత్యువాత పడ్డ 19 మేకలు

BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన రాచకొండ రాములుకు చెందిన 19 మేకలు ఇవాళ మృత్యువాత పడ్డాయి. ఓసి టు చెక్ పోస్ట్ వద్ద ఉన్న బ్లాస్టింగ్ సెక్షన్ కార్యాలయం నుండి వచ్చే వాగులో నిన్న సాయంత్రం నీరు తాగాయని ఆదివారం ఉదయం మరణించాయని రాములు ఆరోపించారు.