హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

NDL: మహానంది మండలం గాజులపల్లెలోని పురాతన శివాలయంలో నాగుల పంచమి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. నోముల దారాలు, నువ్వులు, చలిపిండి తయారు చేసుకుని భక్తులు పుట్టల వద్దకు చేరుకున్నారు. పుట్టకు నూలు దారాలు చుట్టి, నోము చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల పంచమి సందర్భంగా పలు దేవాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.