హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దాతలు సహకారంతో క్రీడా ప్రాంగణం ఏర్పాటు

KDP: కలసపాడు మండలం ఎగువ రామాపురం జడ్పీ ఉన్నత పాఠశాలకు దాతలు సహకారంతో రూ. 15 లక్షల వ్యయంతో అన్ని హంగులతో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి, ప్రధానోపాధ్యాయుడు బాల అంకిరెడ్డి, ఎన్. వెంకట సుబ్బారెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు దాతల నుంచి విరాళాలు సేకరించారు. రూ.15 లక్షలతో విద్యార్థులకు అవసరమైన క్రీడా మైదానాన్ని సమకూర్చారు.