PPM: అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె. సౌమ్యజోస్ఫిన్ జియ్యమ్మవలస మండలంలోని పాఠశాలలు, వసతిగృహాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు, మరుగుదొడ్లను పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా తెలుసుకున్నారు. వసతిగృహాల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
వసతిగృహాల్లో న్యాయమూర్తి ఆకస్మిక తనిఖీలు


