హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

కడప: జిల్లా దేవుని కడప చెరువు బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.