NDL: వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో నల్లమల ఘాట్ రోడ్డులో 5 కి.మీ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫారెస్ట్ అధికారులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. రాబోయే గంటల్లో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్


