హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భక్తిశ్రద్ధలతో బోనాల పండుగకు అంకురార్పణ

WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో శ్రావణమాస బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఆదివారం ప్రారంభమయ్యాయి. సంప్రదాయం ప్రకారం విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో తొలి బోనం సమర్పించి పండుగకు అంకురార్పణ చేశారు. మంగళవాయిద్యాల నడుమ మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.