హైదరాబాద్: 28°C
తెలంగాణ

కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ బాధ్యతలు

MHBD: కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బాలగాని శ్రీనివాస్ గౌడ్ బాద్యతలు స్వీకరించారు. ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా. రాంచందర్ నాయక్ ఈరోజు కాంగ్రెస్ కండువా కప్పి బాధ్యతలు అప్పగించారు. తన నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికీ నూతన అధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు. మండలంలో ప్రతిఒక్క కార్యకర్తను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు.