హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హిందూపురంలో పోలీసుల కార్డెన్ సెర్చ్

సత్యసాయి: హిందూపురంలోని అంబేద్కర్ నగర్, వాల్మీకి కాలనీల్లో పోలీసులు ఆదివారం ఉదయం విస్తృత కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీలు అంకిత సురాన, కె.వి. మహేష్ ఆధ్వర్యంలో 70 మంది సిబ్బంది డ్రోన్‌లతో  తనిఖీలు చేశారు. పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.