KDP: సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలోని APSP 11వ పోలీస్ బెటాలియన్‌లో ఆదివారం డా. సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె. వెంకటప్ప ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం లచ్చన్న చేసిన పోరాటం ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గౌతు లచ్చన్న జయంతి వేడుకలు


