VKB: వికారాబాద్ మున్సిపాలిటీ 23వ వార్డుకు చెందిన ఎండీ గౌస్ ఆజాం కుమార్తె హుస్సేన్ బీ ఇంజనీరింగ్‌లో సీటు సాధించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమె ఉన్నత చదువుల కోసం గ్యాక్ (GAC) ట్రస్ట్ సెక్రటరీ, వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం శ్రీ అనన్య రూ.50,000 విలువైన చెక్కును అందజేసి అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
పేద విద్యార్థినికి మున్సిపల్ చైర్‌పర్సన్ ఆర్థిక సాయం


