హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యోగాల ఖాళీలు లేవు.. దళారులను నమ్మి మోసపోవద్దు'

ASF: ఆరోగ్యశ్రీ సంస్థలో ఎలాంటి ఉద్యోగాల ఖాళీలు లేవని ఆ సంస్థ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మేనేజర్ సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. సంస్థలో ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని, తమకు ఒక్కో పోస్టుకు రూ.20 వేల నుంచి రూ.50 వేలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని కొంత మంది దళారులు నిరుద్యోగులతో నమ్మబలుకుతున్నట్టు సమాచారం వచ్చిందన్నారు. దళారులను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని పేర్కొన్నారు.