హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్తులో మునిగి.. దొరికిపోయిన దొంగలు.!

ఖమ్మం-కొరవి రహదారి సమీపంలోని దాబాలోకి అర్ధరాత్రి చొరబడిన ముగ్గురు దొంగలు వింతగా పోలీసులకు దొరికిపోయారు. దొంగతనం కోసం లోపలికి ప్రవేశించిన వారు, అక్కడ ఉన్న మద్యం చూసి విపరీతంగా తాగి మత్తులో అక్కడే నిద్రపోయారు. ఆదివారం ఉదయం వచ్చిన యజమాని నిద్రిస్తున్న దొంగలను చూసి పోలీసులకు అప్పగించగా.. ఈ వింత ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.