హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అధ్వానంగా కొత్తపేట-ఇంధనపల్లి ప్రధాన రహదారి

MNCL: జన్నారం మండలం కొత్తపేట నుంచి ఇంధనపల్లి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయమై, బురదమయంగా మారింది. రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం రాకపోకలు సాగించే ప్రజలకు ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.