హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గల్లంతైన మత్స్యకారుడు మృతదేహం లభ్యం

కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో గల్లంతైన మత్స్యకారుడు పల్లేటి రాజు (20) మృతదేహం లభ్యమైంది. తాళ్లపాలెం గ్రామానికి చెందిన రాజు శనివారం వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు సముద్రంలో పడి గల్లంతయ్యాడు. రాజు మృతదేహం కోసం మెరైన్ పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం రాజు మృతదేహం సముద్రంలో తేలడంతో గుర్తించిన మెరైన్ పోలీసులు ఒడ్డుకు తీసుకొచ్చారు.