హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహాగణపతి మట్టి సేకరణ కార్యక్రమం

కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి తీరంలో నిర్మిస్తున్న సాగర తీర మహాగణపతి విగ్రహం కోసం మట్టి సేకరణ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి ఇల్లు, దేవాలయం, రైతు పొలం నుంచి మట్టి సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం బందరు కోట రామాలయం వద్ద శాస్త్రోక్తంగా మట్టి సేకరించి మహాగణపతి నిర్మాణ కమిటీ సభ్యులకు అందించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.