హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పశు వైద్యశాలలో సిబ్బంది కొరత

VZM: వంగర మండలం చినరాజులగుమ్మడ పశువైద్యశాలలో వైద్యాధికారి, సిబ్బంది లేకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. వైద్యాధికారి బదిలీపై వెళ్లిన తర్వాత కొత్త నియామకం చేపట్టలేదు. దీంతో 30 గ్రామాల పరిధిలోని సుమారు 43 వేల పశువులకు వైద్యం అందడం లేదు. అత్యవసర సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.