హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదవ మహాసభ అధ్యక్షుడిగా కుమార్ యాదవ్

HNK: అఖిల భారత యాదవ మహాసభ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఎం. కుమార్‌ యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌‌ఛార్జి గిరబోయిన రాజయ్య యాదవ్‌ అధ్యక్షతన శనివారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీ పడగా కుమార్‌ యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలోని 14 మండలాల నుంచి యాదవులు, నాయకులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.