సత్యసాయి: హిందూపురంలో ప్రభుత్వ ఐటీఐలో రెండో విడత ప్రవేశాల అనంతరం మిగిలిన సీట్లకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19లోపు మూడో విడతకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ మురళీకృష్ణ తెలిపారు. దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని, 20న నిర్వహించే కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తులు


