హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్‌తో విద్యార్థులకు విద్యా సామగ్రి

సత్యసాయి: సోమందేపల్లి మండలంలో రంగేపల్లికి చెందిన పోగాకు ఆంజనేయులు సేవా భావం చాటుకున్నారు. తన వృద్ధాప్య పెన్షన్ నుంచి నెలకు రూ.1,000 చొప్పున పొదుపు చేసి, రూ.10 వేల విలువైన విద్యా సామగ్రిని విద్యార్థులకు అందించారు. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు అట్టలు, పలకలు, నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు తదితర సామగ్రిని పంపిణీ చేశారు.