హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యూకే ఉద్యోగం పేరుతో మోసం..!

NTR: విజయవాడలో యూకే ఉద్యోగం పేరుతో మోసం వెలుగుచూసింది. నగరానికి చెందిన కన్సల్టెన్సీ నిర్వాహకుడు సతీష్ బాబు యూకేలో నెలకు రూ. 2.25 లక్షల జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బాధితుడి నుంచి రూ. 40 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదు అందింది. యూకే వెళ్లిన తర్వాత మోసం జరిగినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం కేసు నమోదైంది.